తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మారణహోమ యుద్ధాన్ని ఇజ్రాయిల్ తక్షణమే ఆపాలని, పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న నిరంతర బాంబు వైమానిక దాడులు నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత ప్రధాని మోడీ నోరు విప్పి మాట్లాడాలని, శాంతి చర్చల వైపు నడిపించాలని, అమెరికా సామ్రాజ్యవాదం ముసుగులో పడవద్దని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ