తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పదో వార్డు కౌన్సిలర్ పద్మ అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో జరిగిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పండ్లు, వివిధ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి గాలి లేనిదే బ్రతుకు లేదని, కాలుష్య నివారణ చేస్తూ, స్వచ్ఛమైన గాలి కావాలంటే మొక్కలను నాటాలని, తద్వారా పర్యావరణం పరిరక్షించబడుతుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మొక్కల యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరోజ ,ఆర్పీలు బానోతు జానకి, మేడిపల్లి కవిత, శానిటేషన్ సిబ్బంది శాంత, స్వరూప, సందీప్, బాబా, సమైక్య గ్రూప్ సభ్యులు నాయకులు కన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ