తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 21 తెలుగు వెలుగు) జూలూరుపాడు సిపిఐ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ భాష మాట్లాడుతూ పేదవాడు ఉన్నంతవరకు ఎర్రజెండా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని .సిపిఐ పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని అధికారం వున్నా లేకున్నా పేద ప్రజల పక్షానసిపిఐ పని చేస్తుందని అన్నారు. శనివారం జూలూరుపాడు మండల కౌన్సిల్ కార్యవర్గ సమావేశం, సీనియర్ నాయకులు ఎల్లంకి మధు నివాసంలో సిరిపురపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రవేట్ పరం చేసి అంబానీ ,ఆదానిలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా వాడవాడల పార్టీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ చండ్ర నరేంద్ర కుమార్, సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, aiyf జిల్లా కార్యదర్శి, ఎస్కె నాగుల్ మీరా, సిపిఐ నాయకులు, గుడిమెట్ల సీతయ్య, sk చాంద్ పాషా కంచర్ల రాజు కంప సాటి నాగేశ్వరరావు, బడుగు వీరస్వామి, వెంకటప్పయ్య, గార్లపాటి శివకృష్ణ, నిమ్మటూరి లచ్చయ్య, పవన్ దేవినేని రాము aisf జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ