తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు 24 వ వార్డ్ పరిధిలో గల అంగన్వాడి కేంద్రంలో వయోవృద్ధులు వారోత్సవాలలో భాగంగా వార్డ్ కౌన్సిలర్ సత్యభామ మాట్లాడుతూ వృద్దులు ఎటువంటి ఒత్తిడికి గురికాకూడదని ప్రతి ఇంట్లో పెద్దవారు ఉంటే ఆ ఇంట్లో పిల్లలు మంచి పద్ధతులు పాటిస్తారని చెప్పడం జరిగింది సూపర్వైజర్ శారద మాట్లాడుతూ వృద్దులు వారి కుటుంబం గురించి ఎన్నో కష్టాలు త్యాగాలు చేస్తేనే పిల్లలు ఒక స్థాయికి ఎదిగారని వృద్దులు కుటుంబానికే కాకుండా సమాజ సేవకు వారి సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి చెప్పడం జరిగింది, రిటైర్డ్ ప్రిన్సిపల్ సందీప్ వయో వృద్ధుల చట్టాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ సత్యభామ వృద్దులకు సన్మానాలు చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంగన్వాడి టీచర్స్ సుజాత, జుబేదా, గౌసియా, రాజమణి, హెల్పర్స్ సుజాత త్రివేణి, మల్లేశ్వరి మరియు వార్డులోని పెద్దలు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ