Sunday, 19 April 2026 01:59:38 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.

Date : 25 February 2026 08:12 PM Views : 193

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తొలి రోజు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ డి. వేణుగోపాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా క్రమబద్ధంగా నిర్వహించబడినట్లు తెలిపారు .ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల, పాల్వంచ లోని పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రతా పంపిణీ విధానం, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, ఇన్విజిలేషన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను సమీక్షించి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడినట్లు తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలు కలిపి మొత్తం 9,685 విద్యార్థులు ఉండగా , అందులో 9,210 మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. జనరల్ విభాగంలో 7,973 మందికి విద్యార్థులు ఉండగా , 7,683 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,712 మంది ఉండగా, 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు .తదుపరి రోజుల్లో నిర్వహించనున్న పరీక్షలు కూడా ఇదే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :