తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామపంచాయతీ పరిధి(కోస గుంపు)లో ఫారెస్ట్ అధికారులు, గిరిజనులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాము సాగు చేస్తున్న పోడు భూములను శుక్రవారం ఫారెస్ట్ అధికారులు జేసీబీతో కందకాలు తీస్తున్నారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు లాక్కోడానికి ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న తమపై దాడులు చేశారని వాపోయారు.
Admin
తెలుగు వెలుగు టీవీ