తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిజెపి ఖమ్మం పార్లమెంట్ కి పోటీ చేసిన అభ్యర్థి తాండ్ర వినోద రావు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినది అని. జూన్ నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు ఖరీఫ్ సీజన్ అయిపోతున్నప్పటికీ రాని రైతు భరోసా,సీతారాం ప్రాజెక్టు డిజైన్ మార్చి రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము అని అన్నారు, అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు భాగంగా జూలూరుపాడు ,పడమటి నరసాపురం, బేతాళ పాడు, కరువారిగూడెం, కొమ్ముగూడెం , మాచినపేట, సూరారం , పాపుకొల్లు గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు, పాపకొల్లు గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి వినోద రావు పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు , తెల్లం నరసింహారావు నున్న రమేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు వంశీ, చంద్రశేఖర్ దుదుకూరు కార్తీక్, చంద్రశేఖర్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, భూక్య శ్రీను, భూక్య రమేషు, నిమ్మటూరి రామారావు భూక్య రవి ,బాలకృష్ణ ,పూరే వెంకటేశ్వర్లు, రాంబాబు, చరణ్, లక్ష్మయ్య ,వాసు తదితరులు పాల్గొన్నారు,
Admin
తెలుగు వెలుగు టీవీ