తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించబడినట్లు జిల్లా ఆహార భద్రత అధికారి శరత్ తెలిపారు.ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి నుండి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించగా సుమారు 75 మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా సురక్షిత ఆహారం వినియోగం, పరిశుభ్రత ప్రమాణాల ప్రాముఖ్యత, నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఎక్స్‌పో నిర్వహించి, ఆహార భద్రతా నియమాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న సేవలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి అధికారులు ప్రత్యక్షంగా వివరణలు అందిస్తూ, సందేహాలను నివృత్తి చేశారు. నమోదు మేళా నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల నమోదు చేపట్టి, ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై మార్గదర్శకాలు అందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల వంట కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పోషకాహారం తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార భద్రతా నియమాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అనంతరం రిజిస్టషన్ పత్రాలు అందజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ