తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 26 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామంలో తెలంగాణ దీరవనిత మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా వినోబా నగర్ గ్రామంలో సాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉద్యమ పోరాటాలలో మహిళల పాత్ర అసమాన్యమైనదని అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. ఆమె జయంతి సందర్భంగా ఆ మహానీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని గ్రామస్తులు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో తంబారపు శ్రీను, సిరికొండ పెద్ద నరసింహారావు, ముదిగొండ రమేష్, సిరికొండ సుభాకర్, తంబారపు వేణు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ