తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఫోటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఐడీఓసీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ, జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత, ఖచ్చితత్వం కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఫోటో సిమిలర్ ఎంట్రీలను బూత్ స్థాయి అధికారులు (BLOలు) క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలను సరిచేసి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ , జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అన్ని దశలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫోటో సిమిలర్ ఎంట్రీలకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అర్హులైన ఓటర్ల వివరాలను సరిచేయాలని తెలిపారు. మ్యాపింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్, డేటా అప్‌డేషన్ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, రోజువారీ పురోగతిని సమీక్షించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి బాధ్యతతో సమన్వయంగా పనిచేసి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ