తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని జైభీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.వార్త దినపత్రిక 29వ వార్షకోత్సవం సంధర్భంగా వార్త ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో జరుగుతున్న వార్త మెగా వీఐపీ క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజు పోటీలను టాస్ వేసి ప్రారంభించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పోటీల్లో అయినా గెలుపు ఓటములు సహజమని అన్నారు.గెలిచిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించలని,ఓడిన వారు మరింత పట్టుదలతో ఆడుతూ గెలుపు దిశగా అడుగులు వేయాలన్నారు.క్రీడాకారులను ప్రోత్సహించడం కొరకు క్రీడాకారులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతీ సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.వార్త ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం విజయవంతం అయిన మాదిరిగానే ఈ సీజన్ కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో గంధం మల్లికార్జున రావు,శివ,మురళి,లింగేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ