తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 30 (తెలుగు వెలుగు)కాంగ్రెస్ పార్టీ 420 మాటలు బంద్ చేసి హామీలు అమలు చేయాలని, అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బిఆర్ఎస్ నాయకురాలు, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి విమర్శించారు. గాంధీ వర్దంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు సూచనల మేరకు సూపర్ బజార్ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ...
హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను ఇచ్చిందని, అందులో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. గ్రామ సభల పేరుతో ప్రజలను మభ్య పెడుతూ... ప్రశ్నించిన ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. 420 హామీలను నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంచి బుద్ది ప్రసాదించాలని గాంధీని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తొగరు రాజశేఖర్, అనుదీప్, హుస్సేన్, మాధవిలత, శివ, మైనుద్దీన్, ఖాజా, షరీఫ్, షమ్మీ, మోరే చాణిక్య, శ్రీకాంత్, పూర్ణ చందర్ రావు, సిందు తపస్వి, అక్బర్, ఐలయ్య, జాహీద్, పీటర్, రాజేష్, సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ