Monday, 20 April 2026 01:51:33 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పండగ వాతావరణంలో బడులు ప్రారంభించాలి... అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ విద్యా చందన.

Date : 10 June 2025 08:46 PM Views : 534

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఈరోజు జిల్లా డిఆర్డిఏ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండలాల మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారులు, ఏ.పి.ఎం లు పాల్గొన్నారు.ఈ సమావేశలో జిల్లా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీ, విద్యా చందన మాట్లాడుతూ, జూన్ 12న పాఠశాలలో పునః ప్రారంభం కాబోతున్న శుభ సందర్భంగా, అన్ని పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్ధి, మామిడి తోరణాలతో అలంకరణ చేసి, పండగ వాతావరణం లో విద్యార్థులను ఆహ్వానించాలని అన్నారు.పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందవలసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పాఠశాలకు చేరేలా చూసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత విభాగాలతో సంప్రదించి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. బడిబాట షెడ్యూల్ ప్రకారం ఇంటింటికి వెళ్లి సర్వే చేసి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం, డిజిటల్ విధానంలో తరగతుల బోధన, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ద్వారా నాణ్యమైన విద్య బోధన మౌలిక వసతులతో కూడిన భవనాలు వంటి సదుపాయాలగూర్చి వివరించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. నీరు నిలువ ఉండే ప్రాంతాన్ని బట్టి ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ సమావేశం లో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి మాట్లాడుతూ..పాఠశాలలు 12వ తేదీన ప్రారంభం అవుతున్న సందర్భంగా, పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు పొదలు శుభ్రం చేసి విషపురుగులు లేకుండా పాఠశాలలోని తరగతి గదులు శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలన్నారు.జూన్ 12న పండుగ వాతావరణం లో విద్యార్థులను,తల్లిదండ్రులను, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులను, స్థానిక రిటైర్డ్ ఉద్యోగులను ఆహ్వానించి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి 2025-26 వ విద్యా సంవత్సరమునకు సంబంధించిన పాఠశాల విద్యా ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు అంగన్వాడీ టీచర్ల సహకారంతో, గ్రామంలోని 5సం. రాలు నిండిన ప్రతి పిల్లవాడు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా 100% నమోదుకు కృషి చేయాలని సూచించారు.గ్రామంలో బడి బయట పిల్లలు ఎవరైనా ఉంటే వారిని వెంటనే పాఠశాలల్లో చేర్పించి బడిబయట పిల్లలు లేని గ్రామంగా చూసుకోవాలన్నారు. కలెక్టర్ సూచనల మేరకు అన్ని పాఠశాలల్లో ఆరు రకాల చెట్లు, ఐదు రకాల ఔషధ మొక్కలు పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.బడిబాట కార్యక్రమానికి సంబంధించి రోజువారి షెడ్యూల్డ్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి, ప్రతిరోజు బడిబాట రిపోర్టును మరియు యూనిఫారం వివరాలను ఐ.ఎస్.ఎం.ఎస్ (స్కూల్ ఎడ్యుకేషన్ యాప్) నందు ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాలన్నారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ (VER) ను ప్రధానోపాధ్యాయులు అప్డేట్ చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ డి ఆర్ డి ఓ నీలేష్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు యస్. కె. సైదులు, ఎన్. సతీష్ కుమార్, DPM లు రంగారావు, నాగజ్యోతి, ఎంపీడీఓ, MEO, APM లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :