Sunday, 21 June 2026 02:17:14 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

సీఎం కప్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 05 January 2026 05:45 PM Views : 320

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లాలో విజయవంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై క్లస్టర్ ఇన్చార్జిలు , ఎంఈఓ లు , డీఈవో , డిపిఓ సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే సీఎం కప్ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీలు ఐదు దశలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ఈ నెల 17 నుండి 22 వరకు, మండల స్థాయి పోటీలు ఈ నెల 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 10 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దశల పోటీల్లో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొనే అర్హత పొందుతారని చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి 19 నుండి 26 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామస్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణ కోసం జిల్లాను 77 క్లస్టర్లుగా విభజించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పోటీలు సక్రమంగా నిర్వహించేందుకు ఎంఈఓలు, సీఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలతో పాటు ఫుట్‌బాల్ పోటీలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో వివిధ రకాలైన మొత్తం 21 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో సీఎం కప్ క్రీడా పోటీలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని, క్రీడల్లో పాల్గొనదలచిన వారు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేలా అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్ (satg.telangana.gov.in/cmcup) లేదా ‘CM Cup’ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి ప్రభుత్వం సర్టిఫికేట్లు అందజేస్తుందని అన్నారు. పోటీల నిర్వహణకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం రెండు మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక మైదానాన్ని బాలుర పోటీలకు, మరో మైదానాన్ని బాలికల పోటీలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గెలుపొందిన వారు నియోజకవర్గ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ వివరించారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో విద్యార్థులు, యువకులతో పాటు అన్ని వయసుల క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాప్రియులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: