Sunday, 21 June 2026 03:15:40 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ .

Date : 20 June 2026 07:29 PM Views : 19

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును మరింత పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశం శనివారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షత వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డ్ ప్రతినిధులు, వివిధ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో ప్రాధాన్యతా రంగ రుణాల లక్ష్యాలు, సాధనపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2026 మార్చి 31 నాటికి జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగంలో రూ.4,945.28 కోట్ల లక్ష్యానికి గాను రూ.5,201.20 కోట్లు మంజూరు చేసి 105.18 శాతం సాధన నమోదైనట్లు వెల్లడించారు.వ్యవసాయ రంగంలో రూ.3,899.28 కోట్ల లక్ష్యానికి గాను రూ.4,351.34 కోట్లు మంజూరు చేసి 111.59 శాతం సాధన నమోదైంది. ఇందులో పంట రుణాల కింద రూ.2,291.82 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,884.65 కోట్లు (82.20 శాతం), అగ్రి టర్మ్ లోన్స్ కింద రూ.1,416.09 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,622.20 కోట్లు (114.55 శాతం), అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.31.41 కోట్ల లక్ష్యానికి గాను రూ.19.09 కోట్లు (58.71 శాతం), అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కింద రూ.159.97 కోట్ల లక్ష్యానికి గాను రూ.825.40 కోట్లు (515.97 శాతం) మంజూరు చేసినట్లు వివరించారు.ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.847.80 కోట్ల లక్ష్యానికి గాను రూ.703.88 కోట్లు మంజూరు చేసి 83.02 శాతం సాధన నమోదైంది. విద్యా రుణాల కింద రూ.25.39 కోట్ల లక్ష్యానికి గాను రూ.11.21 కోట్లు (44.15 శాతం), గృహ రుణాల కింద రూ.233.62 కోట్ల లక్ష్యానికి గాను రూ.255.22 కోట్లు (109.25 శాతం) మంజూరు చేసినట్లు తెలిపారు. సామాజిక మౌలిక వసతుల రంగంలో రూ.3.30 కోట్ల లక్ష్యానికి గాను రూ.0.34 కోట్లు మాత్రమే మంజూరు కావడంతో 10.30 శాతం సాధన నమోదైందన్నారు.ఈ సందర్భంగా రైతు రుణాల పంపిణీ అంశంపై బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట రుణాల పంపిణీ లక్ష్య సాధన తక్కువగా ఉన్న బ్యాంకుల అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ రుణాలను సకాలంలో పునరుద్ధరించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్లను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే నిధులను ఇతర రుణాల బకాయిల పేరుతో నిలుపుదల చేయరాదని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అర్హులైన రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన రుణ సహకారం అందించాలని అన్నారు . జిల్లాలో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా బ్యాంకులు రుణాల పంపిణీలో మరింత చొరవ చూపాలని సూచించారు.పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.3.24 కోట్ల లక్ష్యానికి గాను రూ.18.73 కోట్లు మంజూరు చేసి 578.09 శాతం సాధన నమోదవడం సానుకూల పరిణామమని కలెక్టర్ అన్నారు . ఇతర విభాగాల్లో రూ.152.35 కోట్ల లక్ష్యానికి గాను రూ.86.62 కోట్లు మంజూరు చేసి 56.86 శాతం సాధన నమోదైనట్లు తెలిపారు.స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) తగ్గింపు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, పీఎం ముద్ర, పీఎం విశ్వకర్మ, పీఎంఎఫ్‌ఎంఈ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) అమలుపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. రూ.8,914 కోట్ల లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.4,593 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి రూ.889 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.221 కోట్లు, ఇతర రంగాలకు రూ.3,211 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, రిజర్వ్ బ్యాంక్ అధికారులు, నాబార్డ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: