తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 7 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వం ద్వారా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏడు చెరువులకు 48,750 ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం చాలా సంతోషకరం అని మత్స్యకారులకు మంచి లాభాలు వచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో స్వాతి బిందు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి , కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మాలోత్ మంగీలాల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ