తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజనల్ వ్యాప్తంగా ట్రాఫిక్ కంట్రోల్ లో భాగంగా బారికేడ్లలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మరమ్మతులకు గురై సరిగా వినియోగించని బరకేడ్లను మరమ్మతులు చేపట్టి, రంగులు వేసి నూతన బారికేడ్లగ మార్చిన పోలీసులు వాటిని ఇప్పుడు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. పలు పండుగలు, కార్యక్రమాలు వచ్చినప్పుడు వాహనాలు ఇష్టానుసారంగా వెళ్తుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల అనుసారం ట్రాఫిక్ నియమాలను పటిష్టం చేయనున్నారు. దీనికి అవసరం అయ్యే అన్ని రకాల ఈక్విప్మెంట్లను పోలీసులు సిద్ధం చేశారు. మధ్యతరహా, భారీ సైజ్ ఉండే బారికేడ్లను సిద్ధం చేసిన పోలీసులు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఆయా చోట్లకు వాటిని తరలించి వాటిని ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ