Monday, 20 April 2026 01:44:21 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జూలై 23న విద్యాసంస్థల(పాఠశాలలు, కళాశాలల) బంద్ ను విజయవంతం చేయండి : ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బంద్ గోడ పత్రికవిడుదల

Date : 20 July 2025 04:28 PM Views : 598

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 20 (తెలుగు వెలుగు ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాపిత పాఠశాలు,జూనియర్ కళాశాలల బంద్ ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ. (ఏఐవైఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా రాష్ట్ర వ్యాపిత బంద్ కు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.ఈసందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు చేస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోకడం వల్లనే విద్యారంగం కుంటుపడిందని,దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని వారు ఆరోపించారు.అదే విధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,ఎంఇఓ, డీఈఓ, తదితర పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో అవినీతిని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 8వేల కోట్ల రూపాయల విద్యార్థుల ఉపకార వేతన బకాయిలను, బోధనా రుసుములను లను విడుదల చేయాలని,రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, యూత్ డిక్లరేషన్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ బంద్ కు ఏఐవైఎఫ్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొంటారని, అదే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు సహకరించి, పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ నాయకులు పసుపులేటి పవన్,చపలమడుగు హర్ష వర్ధన్, సమందుల సందీప్,జస్వంత్,సూర్య రుషి వరన్ కిరణ్ సాయి కుమార్ తదితరుల పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :