తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బహుజనసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ తాండ్ర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ జంతువుల కంటే హీనంగా బ్రతికినటువంటి మనుషులకు మానవ హక్కులు కల్పించి అంతకు ముందు ఉన్న పరిస్థితులకు భిన్నంగా మహిళలను వంటింటికి మాత్రమే పరిమితం చేసి వారి హక్కులను కాలరాచిన పరిస్థితుల నుండి ఈరోజు దేశాన్ని పాలించే పరిస్థితిలకు యుద్దాలలో యుద్ధ విమానాలు నడిపే స్థాయికి మహిళలు ఎదగడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన హక్కులే ముఖ్య కారణం ప్రపంచంలో ఎన్నో దేశాలు మన దేశం కంటే వెనకాల స్వతంత్రం వచ్చి రాజ్యాంగాలు రచించుకున్నప్పటికీ అంతర్గత యుద్ధాలతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో కూడా 78 సంవత్సరాల తర్వాత కూడా భారత రాజ్యాంగం చెక్కుచెదరకుండా నిటారుగా నిలబడి ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలవడంలో ప్రపంచ మేధావిఅంబేద్కర్ కృషి అనితర సాధ్యమైనది కాబట్టి నేటి యువత ఆయన బాటలో అయనా ఆశయ సాధనలో ముందడుగు వేయాలని ఆ త్యాగధనుడు తన కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి భారత దేశానికి అంకితం చేసిన ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జే బి శౌరి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, భారతరత్న అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలశివకుమార్, దండోరా నాయకులు కూసపాటి శ్రీనివాస్, కొత్తగూడెం బార్అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, బీసీ నాయకులు మల్లెల రామనాథం, అంకినీడు ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద హనుమంతు రావు, జై భీమ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎర్ర కామేష్, ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్, టీజీబికే ఎస్ మాజీ అధ్యక్షులు ఆవు నూరి కనకరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, మిట్టపల్లి సాంబయ్య, వీరభద్ర ,సంఘం నాయకులు బిక్షపతి, రజక సంఘం నాయకులు నాగయ్య, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా రమేష్, బిసి సంఘ నాయకులు ప్రభాకర్, చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి, మోదుగు జోగారావు (ఎస్సీ రిజర్వేషన్ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్) మురళి , బండి పల్లి కిరణ్, కుంపటి నాగరాజ్, వార్డ్ మెంబర్ దంసలపూడి భాస్కర్, బడికల పుష్పలత, గాయత్రి గిరిశం , మంద వెంకటేశ్వర్లు, మంద సాంబయ్య , ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చదరపు కృష్ణమూర్తి, హెచ్ఎంఎస్ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ