తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి, గోధుమ వాగు బ్రిడ్జి పై పడ్డ గుంతల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ మీద పెట్టే శ్రద్ధ ప్రజా పాలన మీద లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 22 నెలల కాలం గడుస్తున్న పాడైన రోడ్ల వద్ద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని మండి పడ్డారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవని అన్నారు. పాడైన రోడ్లను బాగు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామిని అమలు చేయలేదని, 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను దగా చేశారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే విద్యార్థినికి స్కూటీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500 వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. తక్షణమే రోడ్లను బాగు చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబుల వేణు, లక్ష్మీదేవి పల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, పూర్ణచందర్ నాయక్, బాబుజానీ, మధు, నిజాం, హైమద్, అశోక్, రాసపల్లి శీను, సురేందర్, బాబా, అమన్, మనోజ్, యుగంధర్, చందు, షణ్ముఖ సాయి, అబ్బు, చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ