తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాపకొల్లు గ్రామంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఏపీఓ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, వర్షపాతం పెంపు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడంలో మొక్కల పెంపకం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి సంరక్షణ, రక్షణకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని సర్పంచులు, గ్రామ సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అందువల్ల మండలంలోని ప్రజలందరూ వనమహోత్సవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, మొక్కల నాటకం మరియు వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ