తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం జిల్లాలోని క్రీడాకారులకు మౌలిక సదుపాయం కోసం వివరించడం జరిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీ గ్రౌండ్ నందు సింథటిక్ ట్రాక్ కొరకై జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సానుకూలంగా స్పందించి అధికారులను వేగవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి ,జనరల్ సెక్రెటరీ రాసపల్లి రాజేంద్రప్రసాద్, కోశాధికారి పి కాశీ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ