తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఉన్న మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఏఐటీయూసీ నాయకులు నరాటి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. మినీ అంగన్వాడీ టీచర్లు గత ఎన్నో సంవత్సరాలుగా గొడ్డు చాకిరి చేస్తున్నారన్నారు. మినీ అంగన్వాడి టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ