తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ.10.09.2025 నాడు , జూలూరుపాడు మండలంలో జిల్లా ఉద్యాన అదికారి జంగా కిశోర్ దరఖాస్తు చేసుకున్న రైతు క్షేత్రాలను పరిశీలించడం జరిగింది . దీనిలో బాగంగా పూలతోట సాగును చేసే రైతులకుఉద్యాన శాఖ నుండి రైతులకు ఎకరానికి రాయితీ రూపంలో రూ .8000/- , వారి బ్యాంక్ ఖాతాలోకి జమచేయడం జరుగుతుంది . బంతి తోట సాగు చేసే రైతుకు ఎకరానికి 4 నుండి 6 టన్నులు దిగుబడి వస్తుంది . ప్రస్తుతం మార్కెట్ లో 1 కేజి బంతి పూల ధర రూ 50/- నుండి 60/- పలుకుతుంది కానీ ఇదే కేజి బంతిపూల ధర పండుగుల సమయంలో మాత్రం రూ 100/- నుండి రూ 150/- వరకు ఉంటుంది . పూలతోట సాగు చేసే రైతుకు ఒక ఎకరానికి నికర ఆదాయం రూ 100000/ నుండి రూ 1,50,000/- వరకు ఆదాయం పొందవచ్చు .ఈ అవకాశాన్ని వినియోగించడానికి దరఖాస్తు చేసుకొని, ఈ పథకాల వల్ల లబ్ది పొందగలరని మనవి.రైతులు తమ సంబంధిత ఉద్యాన విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోగలరు. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ( జిరాక్స్ కోపీస్ ),1. అప్లికేషన్, 2. పట్టాదారు పాస్బుక్ పుస్తకం, 3. బ్యాంక్ పాస్బుక్ పుస్తకం, 4. ఆధార కార్డ్ , 5. పాస్ ఫోటో సై జు పోటోస్ (2) డాక్యుమెంట్స్ ను మీ మండల ఉద్యాన విస్తరణ అడికారికి ఇవ్వగలరు .జిల్లాలోని పూలతోట సాగు చేసే రైతులు అందరూ ఉద్యాన శాఖ ద్వారా వచ్చే రాయితులను వినియోగించుకోగలరు అని విజ్ఞాపి .
Admin
తెలుగు వెలుగు టీవీ