తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి K. శ్రీకాంత్, ప్రాంతీయ కార్యదర్శి, ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్, భవానీ శంకర్, కార్యదర్శి, ఎస్‌బీఐ యూనియన్, ఈ. శాంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, TCCBEA, వి. కృష్ణారావు, కార్యదర్శి, డీసీసీబీ, శ్రీకాంత్, కార్యదర్శి, యూనియన్ బ్యాంక్ – కొత్తగూడెం మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం తగ్గించి, పని–వ్యక్తిగత జీవన సమతుల్యత సాధించేందుకు 5 రోజుల బ్యాంకింగ్ విధానం అత్యవసరం అని వారు స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులకే కాకుండా ప్రజలకు కూడా మేలు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్‌ను అమలు చేయాలని కోరారు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, కొత్తగూడెం
Admin
తెలుగు వెలుగు టీవీ