తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని పతంజలి ఆరోగ్య సేవా కేంద్రం నిర్వాహకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దివంగత జుగల్ కిషోర్ పంచార్య పెద్ద కుమారుడు విష్ణు కుమార్ పంచార్య గురువారం రాత్రి అకాల మృత్యువుకు గురి కావడంతో మార్వాడి సమాజం కన్నీరు మున్నీరుగా విలపించింది. మార్వాడి సమాజంలోని పెద్దలు శుక్రవారం విష్ణు కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన ఆయుర్వేద వైద్య సేవలను కొనియాడారు. నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న వారిలో విష్ణుకుమార్ సోదరులుఅశోక్ కుమార్ పంచార్య, మార్వాడి సత్రం మేనేజర్ గోపాల్ పంచార్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా విశ్రాంత రవాణా అధికారి ధనరాజ్ బజాజ్, అశోక్ రాటి, వల్లభ దాస్ దామోదర్ దాస్ అటాస్నియా, దుర్గ శంకర్ జాజు, శంకర్, ప్రకృతి ఆశ్రమం కోఆర్డినేటర్ సుగుణారావు, ప్రముఖ సంఘ సేవకులు లగడపాటి రమేష్ చంద్, నరేంద్ర కుమార్ సోనీ, విమల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ