తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్కర సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడాలి.జిల్లా పోలీస్ శాఖ తరఫున DDRF బృందాలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద జరుగుతున్న డిడిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ రోహిత్ రాజు బుధవారం నాడు సందర్శించారు. శిక్షణా శిబిరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి అందుతున్న శిక్షణ తీరును పర్యవేక్షించారు. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో డిడిఆర్ఎఫ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డీడిఆర్ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను సంరక్షించడానికి ఈ బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్, బోట్లు,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని శిక్షణ పొందుతున్న బృందాలకు సమకూర్చడం జరిగిందని తెలియజేశారు.విపత్కర సమయాల్లో డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ ఎల్లయ్య, ఆపరేషన్ ఆర్ఐ బి. రవి, ఎస్ఐ రాజేష్, పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, డిడిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ