తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులకు ప్రజలకు అటు గ్రామస్తులకు మరింత సమాచారం క్షణాలు తెలుసుకోవాలంటే ప్రతి గ్రామంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్కు అందుబాటులోకి తీసుకురావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఇండియన్ టెలికం సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి భాస్కర రావు బృందం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్కు మరింతగా గ్రామాల్లోకి వెళ్లే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. మండలానికి పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని నెట్వర్క్ ను మరింతగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కృషి చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత చేరువయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ప్రధానంగా యువత ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళకుండా చేతిలో మొబైల్ ఫోన్ నెట్వర్క్ ఉంటే దేశంలో జరిగే ప్రతి విషయాన్ని కరెంట్ అఫైర్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుందని తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పంచాయితీలలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను అందజేసి ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లే విధంగా తగు ఏర్పాటు చేయాలన్నారు. తొలుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటిఎస్ డైరెక్టర్ ఎం అరవింద్, ఐ టి ఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ జి గణేష్ కుమార్, ఏటీఎం జి సుభాష్, ఎస్ డి ఈ సక్రు, ఎంఆర్డివి శివరాంజి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ