తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అబలలకు అక్షర ఆయుధాన్ని అందించిన దీరవనిత సావిత్రిబాయి పూలే అని పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ కొనియాడారు. శనివారం జాతీయ మహిళా టీచర్స్ డే సందర్భంగా రామవరం 16వ డివిజన్లో అంగన్వాడి సెంటర్లోని టీచర్లను కలుసుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంగన్వాడి సెంటర్లో పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆమె ఒక ఉపాధ్యాయురాలి గానే కాక ,అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆమె అన్నారు ఆమె తన భర్తతో కలిసి స్త్రీ విద్యను ప్రోత్సహించి సమాజంలో స్త్రీలకు గౌరవాన్ని పెంపొందించిందని ఆమె కొనియాడారు నేటి సమాజంలో ఆమె ఇచ్చిన విజ్ఞానం అక్షర ఆయుధం అజ్ఞానాన్ని తుంచిందని అన్నారు ఒక మహిళా టీచర్ గానే కాకుండా అమ్మలా లాలించి, ఆశయాలను రగిలించి, మన గమ్యాన్ని చూపించే ఓ మహిళా మూర్తిగా ఈరోజు కీర్తింప పడుతుందని అన్నారు. ఇవే మా పాదాభివందనాలు. ఒక మహిళ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనే స్కూల్లో వందలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేది సామాన్యమైన విషయం కాదు అన్నారు. సావిత్రిబాయి పూలే ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటే నేడు మనం చూస్తున్న ఈ మహిళా శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుందని అన్నారు. నేడు మనమందరం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అది ఆమె పెట్టిన అక్షర బిక్ష అని అన్నారు. ఆమె ఆరోజు పేడ విసిరిన వారిని భరించి అక్షరాలను మనకు అందించింది. అందుకే ఆమె ప్రతి మహిళా ఉపాధ్యాయురాలికి స్ఫూర్తి ప్రదాత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎన్ సరోజ ,డి నిలవేణి, ఆయా కౌసల్య, సరిత, అంగన్వాడి పిల్లలు, మరియు తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ