Friday, 17 April 2026 06:38:46 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Date : 23 July 2025 07:53 PM Views : 625

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచంలో గర్వించదగ్గ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పాల్వంచలో బుధవారం యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కమిషనర్ కాలేజ్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవసేన, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రారంభానికి సంబంధించి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారుల సూచనలతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ తదితర అంశాలపై సమీక్ష జరిగింది. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ మరియు పీజీ స్థాయిలో బిఎస్సీ జియాలజీ, బిఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులు ప్రారంభించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు సూచనలు ఇచ్చారు.రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి స్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, విదేశాలలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను సందర్శించి అభ్యాసం చేసి, అక్కడి అనుభవాల ఆధారంగా మౌలిక సదుపాయాలు, కోర్సుల రూపకల్పన చేయాలని నిర్ణయించారు. అంతేగాక, విద్యార్థులకు పరిశోధనలో ప్రోత్సాహం కల్పిస్తూ, ఉద్యోగ అవకాశాలు పొందేలా యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. దీనికోసం RUSA నిబంధనల ప్రకారం నిధుల సమీకరణ చేయాలని కూడా పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన కీలక అధికారులంతా సమావేశంలో పాల్గొని, ప్రపంచంలో మొట్టమొదటి ఎర్త్ సైన్స్‌కు ప్రత్యేకమైన యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన చర్యలు, కోర్సులు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి సమర్పించి, వారి ఆమోదంతో ఆగస్టులో యూనివర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యమ కాలంలోనే ఈ యూనివర్సిటీకి సంబంధించిన సంకల్పం తీసుకున్నట్లు గుర్తు చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖనిజ సంపదకు కేంద్రంగా నిలుస్తుందని, జిల్లాలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కలెక్టర్ ఇప్పటికే ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని, శాసనసభ్యుల సహకారంతో ప్రభుత్వం మద్దతు తీసుకురాగలిగామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జియాలజీ, భూవిజ్ఞానానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఉన్నా, పూర్తిగా ఎర్త్ సైన్స్‌కు అంకితమైన విశ్వవిద్యాలయం ఇదే మొదటిదని స్పష్టమైంది.అత్యున్నత స్థాయికి ఈ విశ్వవిద్యాలయం ఎదగాలంటే, యోగితా రాణా లాంటి అనుభవజ్ఞులైన అధికారుల పర్యవేక్షణ ఎంతో కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన 300 ఎకరాల భూమిలో, మూడు సంవత్సరాలలో శాశ్వత భవనాలు, అవసరమైన వసతులతో కూడిన యూనివర్సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామని పేర్కొన్నారు. అంతిమంగా, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని “డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”గా నామకరణం చేయాలని మంత్రివర్గం ఆమోదించిన విషయాన్ని మంత్రి తెలియజేశారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఎర్త్ సైన్సీ యూనివర్సిటీ ప్రారంభించడం జిల్లా అభివృద్ధికి శుభ పరిణామం అన్నారు. జిల్లా, రాష్ట్ర, మరియు దేశంలోని విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం ద్వారా వారి యొక్క విద్య ప్రమాణాలు పెంచుకోవడానికి మరియు మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధించటానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ మరియు పీజీ కోర్సులలో ప్రవేశాలు మొదలవుతాయని, రాబోయే మూడు సంవత్సరాలలో విశ్వవిద్యాలయంలో కావలసిన అన్ని కోర్సులు ప్రవేశపెడతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు భూమిపై అవగాహన, భూమికి సంబంధించి అన్ని పరిశోధనలకు సంబంధించిన అన్ని కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు సౌకర్యాలు, వివిధ రకాల కోర్సులు తదితర సదుపాయాలు కల్పనకు వివిధ దేశాల విశ్వవిద్యాలయాల సమన్వయంతో రూపొందిస్తామన్నారు. దీనికిగాను మూడు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆ కమిటీల ద్వారా ఏ కోర్సులు ప్రవేశపెట్టాలి, ఉపాధ్యాయులు నియామకం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.కమిషనర్ కాలేజ్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవసేన మాట్లాడుతూ... డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి పేరు మీద ఏర్పాటైన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించటం మన రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రాముడు కాలు మోపిన ఈ భూమిలో అద్భుతమైన యూనివర్సిటీ స్థాపించడంలో దేశంలోనే వివిధ రంగాలలో నిపుణులను కమిటీలో సభ్యులుగా చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనకు కృషి చేస్తామని అన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే జియో లాజికల్ మ్యూజియం గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉందని అన్నారు. జిల్లాలో అద్భుతమైన కనీస సంపద, గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపన ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు తో పాటు పాటు దేశంలోని విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తాను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి ఐఐటి చదివి ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనలో పాలుపంచుకోవడం ఎంతో గర్వ కారణంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇల్లందు క్రాస్ రోడ్ లోపల టూరిజం హోటల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం హోటల్ నిర్మాణ పనులను త్వరితగతిని పూర్తి చేయాలని., ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం మరియు టూరిజం హోటల్ ను ప్రారంభించే విధంగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం హోటల్ ఆవరణలో ఆకర్షణీయంగా మొక్కల పెంపకం సుందరీకరణ పనులు పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి వైస్ ఛాన్స్లర్ కాకతీయ యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ శ్రీ రామ్ వెంకటేష్ సెక్రటరీ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ వి. రామచంద్రన్ రిజిస్ట్రార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, శ్రీమతి సౌందర్య జోసెఫ్ రూసా ప్రతినిధి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :