తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) 20వ వార్షికోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఆర్‌టీఐ 2025 విజేతలకు బహుమతులు అందజేశారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ జిల్లా అధికారులతో కలిసి వీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ — సమాచార హక్కు చట్టం ప్రజలకు పారదర్శక పరిపాలన అందించేందుకు కీలక సాధనం. ప్రజల అభ్యర్థనలపై సమాచారం త్వరితగతిన, సమగ్రంగా అందించాలనే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలి అని అన్నారు.ఆర్‌టీఐ చట్టం ద్వారా సమాచారాన్ని వేగంగా, నిష్పాక్షికంగా అందించాలనే సంకల్పంతో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ డి ఓ సి కార్యాలయం నుంచి సిపిఓ సంజీవరావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, డి సి ఓ రుక్మిణి, ఏడి ఫిషరీస్ ఇంతియాజ్ ఖాన్, అడిషనల్ డి ఆర్ డి ఓ రవి, పౌరసరఫరాల మేనేజర్ త్రినాథ్ బాబు, భూగర్భ జలాల శాఖ అధికారి రమేష్, పరిశ్రమల శాఖ మేనేజర్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ