Monday, 20 April 2026 01:46:15 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.ఈ.టీ) లో విద్యార్థుల నమోదుకు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ .

Date : 12 March 2025 08:54 PM Views : 612

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.ఈ.టీ) లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో డీ.ఈ.ఈ.టి యాప్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.ఈ.టీ) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయని, నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందని అన్నారు. ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర ఉపాధి కోర్సులు చదివిన విద్యార్థులు డీ.ఈ.ఈ.టి లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ & ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు మెరుగు అవుతాయని అన్నారు. జిల్లాలో ఉన్న ఐటిఐ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాసైన విద్యార్థుల వివరాలను 15 రోజులలో డీ.ఈ.ఈ.టి లో నమోదయ్యే లా చూడాలని అన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు , ఇతర ఉపాధి కోర్సుల కళాశాలలో, ఎంబీఏ కాలేజి విద్యార్థులు కూడా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రైవేట్ రంగంలోనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ లో అర్హత కలిగిన ఉద్యోగాల వివరాలు కూడా విద్యార్థులకు చేరవేసేందుకు డీ.ఈ.ఈ.టీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఏపీవో డేవిడ్ రాజు,, పరిశ్రమల శాఖ తిరుపతయ్య జనరల్ మేనేజర్, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, డిటిసిపిఓ సత్యనారాయణ, ఆర్టిఓ వెంకటరమణ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :