Monday, 20 April 2026 05:34:47 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు రైతు రుణమాఫీ చేయాలని వినతి పత్రాన్ని ఇచ్చిన సేవాలాల్ సేన జిల్లా నాయకులు.

Date : 27 July 2025 04:59 PM Views : 555

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు రైతు రుణమాఫీ చేయాలని వినతి పత్రాన్ని ఇచ్చిన సేవాలాల్ సేన జిల్లా నాయకులు. రెండు లక్షల రూపాయలు పై బడి అప్పు ఉన్న వారికి రుణమాఫీ చేయాలి. ధరావత్ సురేష్ నాయక్ జిల్లా అధ్యక్షులు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఉన్న రైతు సమస్యలపై అదేవిధంగా గిరిజన సమస్యలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు నేడు పుట్టేడు కష్టాలతో, ఆర్థిక భారంతో,నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వం ( కాంగ్రెస్ ప్రభుత్వం) ఎన్నికల ముందు రైతులకు అనేక రకరకాల హామీలతో వరాల వర్షం కురిపించింది.రైతు రుణమాఫీ,రైతు భరోసా పంటలకు గిట్టుబాటు ధర చేస్తామని భరోసా ఇచ్చారు.కానీ పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదు.అనేకమంది రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ప్రభుత్వం వైపు ఎదురుచూస్తున్నారు. అప్పుల ఊబిలో రైతులు నానాటికి మునిగిపోతున్నారు.ప్రభుత్వం నుంచి అందే రుణమాఫీ గాని అందక రాష్ట్రంలో రైతులు బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.కావున ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకు యందు రైతు యొక్క అప్పుతో సంబంధం లేకుండా అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని తమరికి విజ్ఞప్తి చేస్తూ ఈ క్రింది ప్రధాన డిమాండ్ లను కూడా పరిష్కరించాలని కోరుతూ షెడ్యూల్ ఏరియా గిరిజనుల హక్కులను ప్రజా ప్రభుత్వం పరిరక్షించాలి.గిరిజనులకు ఆక్సిజన్ లాంటి జీ ఓ నంబర్ 3 కి బదులు కొత్త జీఓ ఇచ్చి చట్ట బద్ధత కల్పించాలి.జిల్లా జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు అమలు చేయండి.సీతారామ ప్రాజెక్టు నీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాంటి జిల్లాలలో ప్రభుత్వ క్యాన్సర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జిల్లాలలో ఎక్కడ లేనన్ని ఫాక్టరీలు ఉండడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, కిషన్ నాయక్, పవన్ కళ్యాణ్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :