తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతదేశంలో 2047 సంవత్సరం వరకు ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న ఐ ఆర్ డి ఏ (సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ) కి సపోర్ట్ గా టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ మేము సైతం అన్నట్టు సంకల్ప యాత్రను శనివారం నిర్వహించడం అభినందనీయమని టాటా ఏఐఏ లైఫ్ ఇన్స్యూరెన్స్ కొత్తగూడెం బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో వంద మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతను స్లొగన్స్ ఇస్తూ బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు గా అతిథులుగా సింగరేణి రిటైర్డ్ జి ఎంలు అందెల ఆనందరావు, శనగ వెంకటేశ్వర్లు, లీడర్లు డి.శివ ప్రసాద్, కనకదుర్గ బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా ఇంచార్జ్ సంజీవన్, తుంపూరు శివ, దేవరాజు, లక్ష్మణ్, గాయత్రి, కమలరాణి, హరీష్, మనోహర్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ