తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 26న కొత్తగూడెంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి సమ్మేళనం కమిటీ సభ్యులు జిల్లా ఎస్.పి శ్రీ రోహిత్ రాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సమ్మేళనం యొక్క ఉద్దేశాలు, కార్యక్రమ వివరాలు మరియు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్.పి కి వివరించారు. కార్యక్రమం శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చారు.జిల్లా ఎస్.పి శ్రీ రోహిత్ రాజ్ కార్యక్రమంపై వివరాలు తెలుసుకుని, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, హిందూ సమ్మేళనం కార్యక్రమం సమాజ ఐక్యత, ధర్మ పరిరక్షణ మరియు సాంస్కృతిక విలువల బలోపేతం లక్ష్యంగా నిర్వహించబడుతున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు పి. వీరవర్ధనరావు, కార్యదర్శి లట్టి జగన్ మోహన్, సభ్యులు యెల్డండి పూర్ణచందర్ రావు, గుర్రం వెంకట్ రెడ్డి, పిల్లి రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ