తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో గురువారం నిర్వహించిన టీజీ టెట్ జూన్–2026 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లా కేంద్రంలోని అనూ బోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో మొదటి సెషన్‌లో 145 మందికి గాను 130 మంది, రెండో సెషన్‌లో 135 మందికి గాను 101 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ