తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు సంబందించి నిరూపయోగంగా ఉన్న వస్తువులను ది.26.06.2025 (గురువారం) నాడు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించడం జరిగింది.ఈ వేలంపాటలో కంప్యూటర్ మానిటర్లు, CPU లు, కీబోర్డులు,మౌస్లు,UPS లు,ట్యాబ్ లు,యాపిల్ ఐ ప్యాడ్ లు,ఇన్వర్టర్ మరియు ఇన్వర్టర్ బ్యాటరీలు, డ్రాగన్ లైట్లు,టార్చ్ లైట్లు, క్లోత్ టెంట్లు,టేబుళ్లు,కుర్చీలు,బీరువాలతో పాటు ఇతర ఫర్నీచర్ సామాగ్రిని మరియు ఇతర వస్తువులకు వేలంపాట నిర్వహించారు.ఇట్టి వేలంపాటకు సంబంధించి జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక కమిటీని నియమించడం జరిగింది.కమిటీ చైర్మన్ గా డిఎస్పీ మల్లయ్య స్వామి,సభ్యులుగా ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఏవో మంజ్యా నాయక్, ఆర్ఐ అడ్మిన్ లాల్ బాబు,ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు,కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు లు నియామతులయ్యారు.ఈ కమిటీ సమక్షంలో జరిగిన ఈ బహిరంగ వేలంపాటలో అన్ని వస్తువులను 3,07,100/- రూపాయలకు ఆసక్తి గల సభ్యులు చేజెక్కించుకోవడం జరిగిందని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ