Monday, 20 April 2026 01:44:20 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి పై కేంద్ర ప్రభారి అధికారిసోలామన్ అరోకియా రాజ్ ఐఏఎస్ సమీక్షా సమావేశం

Date : 06 October 2025 09:01 PM Views : 376

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి పై కేంద్ర ప్రభారి అధికారిసోలామన్ అరోకియా రాజ్ ఐఏఎస్ సమీక్షా సమావేశం ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు స్థితిని సమీక్షించడానికి, కేంద్రప్రభారి అధికారి సోలామన్ అరోకియా రాజ్ ఐఏఎస్, అదనపు కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ, సోమవారం జిల్లా పర్యటన నిర్వహించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా ప్రధాన కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వ్యవసాయ, మహిళా మరియు ఇతర అభివృద్ధి సంబంధిత కేంద్రాలను పరిశీలించిన తర్వాత, ఐడిఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్యా రంగంలో ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు పర్యవేక్షణతో అందించడం, పాఠశాలల్లో ఔషధ మొక్కల పెంపకం, విద్యా ప్రమాణాలను పెంపొందించే చర్యలు చేపట్టడం వంటి విషయాలను కలెక్టర్ వివరించారు.ఆరోగ్య రంగంలో తల్లి-పిల్లల ఆరోగ్యం, నూతన బ్లడ్ బ్యాంకుల స్థాపన, ఆధునిక వైద్య పరికరాల సమకూర్పు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన వైద్య సేవల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో మునగా, వెదురు అజోల్ల, పుట్టగొడుగుల సాగు, చేపల పెంపకం యూనిట్లు, బయోచార్ తయారీ ఫామ్ పౌండ్ల నిర్మాణం వంటి పథకాల అమలు, అశ్వరావుపేటలో జీవ వనరుల కేంద్రం ఏర్పాటు మరియు మహిళా సంఘాల అభివృద్ధికి కల్పిస్తున్న సదుపాయాలపై స్పష్టంగా వివరించారు.సమావేశంలో కేంద్రప్రభారి అధికారి సోలామన్ ఆరోకియా రాజ్ ఐఏఎస్ మాట్లాడుతూ.. ప్రతి శాఖ నిరంతరం పర్యవేక్షణ, సమగ్ర సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక ఆకాంక్షిత జిల్లా కాబట్టి, ప్రతి అభివృద్ధి సూచికపై సమగ్ర దృష్టి పెట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే విధంగా కార్యాచరణ కొనసాగించాల్సినదని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :