తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్, వికాస తరంగిణి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎఐ వాసవి అసోసియేషన్ యుఎస్ఏ వారి సహకారంతో ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సా శిబిరములు నిర్వహించబడుచున్నవి. ఈ ఆరోగ్య శిబిరముల గురించి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన కార్యాలయంలో కరపత్రములు, బ్యానర్లు గురువారం విడుదల చేసినారు. ఈ ఆరోగ్య శిబిరము భద్రాచలంలోని మారుతి నర్సింగ్ నర్సింగ్ కాలేజి, భద్రాచలం నందు ది.29.06.2025న ఆదివారం మరియు 30.06.2025న సోమవారం దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించబడునని తెలిపినారు. ఈ శిబిరములో కేన్సర్ లక్షణాలు గల వారికి ప్రఖ్యాతి చెందిన కేన్సర్ వ్యాధి చికిత్సలో నిపుణులైన యంఎన్ జె కేన్సర్ ఆసుపత్రి హైదరాబాద్ 1000 పడకల ఆసుపత్రి వారి బృందముతో పాటు భద్రాచలంకు చెందిన స్త్రీల వైద్య నిపుణురాలు డా.వి. జయభారతి, సర్జికల్ ఆంకాలజిస్టు డా||యం. మధుమోహన్ రెడ్డి నిపుణులైన వైద్యులచే నిర్వహించబడును. ఈ శిబిరములో ఉచితంగా పరీక్షలు చేసి ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఆ పథకం ద్వారా ఉచితంగా వైద్య సేవలందించబడునని, ఈ శిబిరం నిర్వహించుటకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సహకారం, సలహాలతో నిర్వహించబడుతుందని రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా॥ఎస్.ఎల్.కాంతారావు వారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ సదాకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపర్చుకొనగలరని రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా||ఎస్.ఎల్.కాంతారావు, వై. సూర్యనారాయణ, ఎ.జగదీష్, బి. రాజారెడ్డి, డా||బి. సుబ్బరాజు, డా॥యం.మోహన్రావు, వి.కామేశ్వరరావు, డా॥ జివివి సుదర్శన్ రావు, గట్టు వెంకటాచారి, డా|| పి. రాజశేఖర్, లయన్ కమలా రాజశేఖర్, పాకాల దుర్గా ప్రసాద్, డా॥భాను ప్రసాద్ తదితరులు కోరినారు. డా||ఎస్.ఎల్.కాంతారావు,ఐఆర్సిఎస్ జిల్లా కో-ఆర్డినేటర్.
Admin
తెలుగు వెలుగు టీవీ