తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివిధ రకాల విత్తనాలతో ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ISGF) భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విత్తనాల బంతులు ( సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం LIC ఆఫీస్ వెనక SGF జిల్లా ఉపాధ్యక్షురాలు ఏస్కె. జరీనాబీ నివాసం లో,వారి సారధ్యం లో పర్యావరణహితం కోసం రానున్న వర్షాకాలంలో ఎక్కడైతే కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో మొక్కల సంఖ్య తక్కువగా ఉందో ఆ ప్రాంతంలో ఈ సీడ్ బాల్స్ ను వెదజల్లే విధానంతో వేయడం ద్వారా తిరిగి మొక్కలు మొలకెత్తి వృక్షాలుగా మారే అవకాశం ఉన్నందున ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా సనాలు వేశారు. ఎస్ జి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, రాష్ట్ర కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాసిం, జిల్లా కోఆర్డినేటర్ జ్యోతి రాణి, జిల్లా కోశాధికారి సమ్మయ్య, జాయింట్ సెక్రటరీ కళ్యాణి, ఉమెన్స్ గిల్డ్ జిల్లా కోశాధికారి సోనా, ఎస్ జీ ఎఫ్ జిల్లా బాధ్యులు నసీం పాషా,శనగ రాంచందర్ రావు, ఖాదర్ మోహినుద్దీన్,చుంచు అంజమ్మ, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ