తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో 124 కోట్లతో జరుగుతున్న పైపు లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు కృషితో కొత్తగూడ నియోజకవర్గ మహిళలు మంచినీటిపై పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని 124 కోట్ల రూపాయలు కిన్నెరసాని మంచినీటి పథకానికి మంజూరు చేయించి గత ఆరు నెలల క్రితం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా రామవరం లో పైప్ లైన్ నిర్మాణం ముమ్మరంగా సాగుతుందని తెలిపారు. సుమారు ఎనిమిది నెలల్లో సాంబశివ గారు కృషితో మహిళల నీటి కష్టాలు తీరుతాయని ఆమె ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన పైప్లైన్ పనులు పూర్తి కాగానే రామవరం లోని శ్రీనివాస టాకీస్ ఏరియాలో నిర్మాణమైన రెండు అతి పెద్ద ట్యాంకులుకి నీళ్లు ఎక్కించినట్లయితే రామవరం ప్రజల నీటి కష్టాలు తీరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పైపులైన్ పనులను పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ డి ఈ రవికుమార్ తో కలిసి పనులను పరిశీలించారు. శనివారం మార్కెట్లో ఆమె మాట్లాడుతూ మార్కెట్లో పైప్ లైన్ వల్ల గుంతల మయమైన రోడ్డు ప్లేస్ లో నూతన రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నూతన రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే నిర్మాణ పనులు వ్యాపార వర్గానికి, వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. అలాగే రోడ్డుమీద లేస్తున్న డస్ట్ కు ట్యాంకర్లతో నీళ్లు చల్లి శుభ్రం చేయాలని అధికారులకు కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ పనులను పరిశీలించిన మున్సిపాలిటీ డి ఈ రవికుమార్, తో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఏరియా పెద్దలు జాకీర్ ,సలీం, సుభాష్, మక్కడు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ