తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రం లో అంబేద్కర్ సెంటర్ నందు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు లో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలు మేరకు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో సీఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ టు వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు హెల్మెట్ కంపల్సరిగా వాడాలని, ఫోర్ వీల్ డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ ధరించాలని, అలాగే ట్రాక్టర్లు ట్రాలీగా నడిపేవారు ట్రక్కు పై రేడియం స్టిక్కర్లు అతికించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు బాదావత్ రవి, అన్నపురెడ్డిపల్లి ఎస్సైచావల చంద్రశేఖర్, చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ, మరియు పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ