తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాలలు రాజకీయాల్లోకి వచ్చి,రాజకీయాల్లో రాణించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.సోమవారం పట్టణంలోని కొమరం భీం భవన్ లో మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందని,బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ప్రజాస్వామ్యం స్థానంలో మనువాదాన్ని ప్రవేశ పెట్టడానికి ప్రయత్నం చేస్తోందని,అదే జరిగితే 93 శాతం ఉన్న ప్రజలు గతంలో మాదిరిగా మళ్లీ బానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.మతోన్మాద విధానాలను అమలు చేయడానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఇవ్వడం లేదని,దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు.ప్రతీ ఇంట్లో రాజ్యాంగం ఉండాలని,ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని,రాజ్యాంగ రక్షణ కోసం గ్రామ స్థాయి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.ఈదేశంలో మనల్ని కాపాడుకున్నది భారత రాజ్యాంగమేనని కానీ రాజ్యాంగం పైన అవగాహన లేక రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను తెలుసుకోలేక పోవడంవల్లనే మనువాదులు రాజ్యమేలుతున్నారని అణగారిన వర్గాల ప్రజలు ఏరోజైతే భారత రాజ్యాంగ విలువను,ఓటు విలువను గుర్తిస్తారో ఆరోజు ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారని,మనువాదుల ఉచ్చులో పడకుండా ఈదేశానికి పాలకులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్య వేదిక కన్వీనర్ రిటైర్డ్ ఇంజనీర్ బరగడి దేవదానం,కో-కన్వీనర్ సింగరేణి రిటైర్డ్ జీ.ఎం.శనగ వెంకటేశ్వర్లు,అడ్వకేట్ డి.శోభారాణి,మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్,రమణమూర్తి, ఇన్నయ్య,రిటైర్డ్ మండల విద్యాశాఖధికారి ఫ్రాన్సిస్,రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుర్రం లక్ష్మయ్య, వి.శ్రీనివాస్ రావు,అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం,ప్రిన్సిపాల్ దాసరి రమేష్,జూనియర్ లెక్చరర్ వరద ప్రభాకర్,రిటైర్డ్ ఉద్యోగులు శనగ స్వామి,గడ్డం రాఘనబాబు,వ్యాపారవేత్తలు ఇస్సాక్,ఉండేటి శాంతివర్ధన్,ప్రైవేట్ ఉద్యోగస్థులు ఎం.వి.రమణ,పంతగానిరాజశేఖర్,పోతురాజు బాబు,ఎస్.కమలాకర్,నామ ప్రసాద్,దుమల మధు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ