తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు దేశ తొలిమహిళా ఉపాధ్యాయురాలు,సంఘ సంస్కర్త మాతా సావిత్రిబాయి పూలే అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ కుల,మత భేదాలకు అతీతంగా ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణి అని కొనియాడారు.సావిత్రిబాయి పూలే లక్ష్యలు,ఆశయాల్ని అచరించాలనుకునే ప్రతీ ఒక్కరూ ఆమె జీవితాన్ని అధ్యయనం చేయాలని,దేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలేనని చాటి చెప్పాలన్నారు.నేటి యువతి, యువకులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వినయ్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,భూక్యా కవిత,నీలా,ఇస్లావత్ భారతి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ