Monday, 20 April 2026 01:50:10 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 28 October 2025 04:09 PM Views : 193

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉండటంతో అటువంటి ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులు, వంతెనలు, చెరువులు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు అవసరమైతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగిపోయిన చోట్ల, చెట్లు కూలిన ప్రదేశాల్లో ప్రజలు చేరరాదని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో విస్తారంగా సాగు చేసిన వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతులు రాబోయే రెండు మూడు రోజులపాటు కోతలను వాయిదా వేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఎత్తయిన ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. కోసిన పంటపై టార్పాలిన్ లేదా ఇతర కవర్‌లతో కప్పి వర్షపు నీరు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పంటను నష్టపోకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. పంట నిల్వ కేంద్రాల వద్ద నీరు చేరకుండా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :