తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ సుజాతనగర్ మండల చుట్టూ సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తూ వారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి విష జ్వరాలు వస్తున్న తరుణంలో ఆసుపత్రి వద్దకు జనాలు వెళ్ళడానికి భయపడేటటువంటి పరిస్థితిని నేడు మనం చూస్తునమ్ ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలు మొత్తం కూడాను చెత్తాచెదారంతో నిండిపోయి అక్కడ దోమలు నివసిస్తూ వచ్చేటటువంటి పేషెంట్లకు మరింత ఆనారోగ్యం , రోగం బారిన పడే విధంగా వీధి కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్న పట్టించుకోనటువంటి ఆసుపత్రి సూపర్డెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రజలు ఇబ్బంది పడాల్సివస్తుంది
కనీసం ఇకనైనా స్పందించి సానిటేషన్, దోమల నివారణకు పిచికారి చేయించాలని పందుల బెడదను తొలగించాలని వచ్చేటటువంటి రోగులను కనీసం కూర్చునే కుర్చీలను ఏర్పాటు చేసి వారికి ఓఆర్ఎస్ నీటిని ఏర్పాటు చేయాలని రోగులపట్ల అశ్రద్ధను వీడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పారిశుద్యo పడకేక్కిందని, వైద్యం ఆటకెక్కిందని, రైతులను నట్టేట ముంచారని, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ