Monday, 20 April 2026 01:34:00 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జిల్లాలో చిన్ననీటి వనరుల గణనను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 November 2025 06:01 PM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్కను అత్యంత పకడ్బందీగా, శాస్త్రీయంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులు­కు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఐదేళ్లకొకసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్ – రెండవ వాటర్‌బాడీస్ సెన్సస్ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణనను సమగ్ర ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా 2000 హెక్టార్లలోపు విస్తీర్ణం గల జలవనరుల గణనను మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ముందుగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నమూనా గణన పూర్తిచేసిన అనంతరం మిగతా గ్రామాల్లో గణన కొనసాగించాలని సూచించారు. గ్రామ స్థాయిలో GPOలు AEO లు TA లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు లను ఎన్యూమరేటర్లుగా పనిచేస్తారని, మండల స్థాయిలో AE విద్యుత్ శాఖ AE irrigation శాఖ పంచాయతీ సెక్రటరీలు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ MAO లు ఎంపీడీవోలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో చిన్న నీటి వనరుల గణన కోసం అవసరమైతే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను కూడా ఎన్యూమరేటర్లుగా వినియోగించాలని ఆయన సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు, లిఫ్ట్ ఇరిగేషన్ నీటి నిల్వ ప్రాంతాలు, బోర్వెల్ కు సంబంధించిన జలవనరులు సహా ప్రతీ నీటి వనరుకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరణ అనివార్యమని ఆయన పేర్కొన్నారు. గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ఎన్యూమరేటర్లకు జిల్లా మరియు మండల స్థాయిలో తక్షణ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, మొబైల్ యాప్ వినియోగం, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణ, వంటి అంశాల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల పరిధిలో చార్జి ఆఫీసర్స్ అయిన తాసిల్దార్లు, ఎంపీడీవోలు మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన సమాచారాన్ని సేకరించి గణన పనులపై సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి నీటి వనరు భవిష్యత్తు సాగునీటి ప్రణాళికలకు, నీటి సంరక్షణ చర్యలకు ముఖ్య ఆధారమని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి గణనను ఖచ్చితమైన సమాచారం మరియు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, సి పి ఓ సంజీవ రావు, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ అధికారి రమేష్, ఇరిగేషన్ EE అర్జున్, పంచాయతీరాజ్ EE, శ్రీనివాస్ ,MPSO లు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :