తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 19 (తెలుగు వెలుగు) భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ రాంబాబు ఆధ్వర్యంలో జూలూరుపాడు ఎస్సై బి రాణా ప్రతాప్ ని మర్యాదపూర్వకంగా కలిసి సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని బహుకరించటం జరిగినది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సమాజానికి ఎంతో మంచి అలవాట్లు నేర్పారు అలాంటి మహానుభావుడు ఆజ్ఞలను పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రజలు నడవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ గోర్ బంజారా పోరాట సమితి జూలూరుపాడు మండల అధ్యక్షులు చరణ్ నాయక్, గోర్ బంజారా సభ్యులు బాపూ సింగ్ నాయక్, అజ్మీరా బాలు నాయక్, శ్రీధర్ నాయక్, ఉపేందర్ నాయక్, పృధ్వి నాయక్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ