Wednesday, 27 May 2026 12:12:27 AM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 27 April 2026 05:22 PM Views : 104

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి డిజిటల్ జనగణన నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, సోమవారం రోజున కలెక్టర్ అంకిత్ తన నివాసంలో స్వయంగా స్వీయ గణన విధానంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రజల సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితమైన సమాచారం నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మే 11వ తేదీ నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసిన వారు నమోదు సమయంలో పొందిన యూనిక్ ఐడీ నంబర్‌ను తెలియజేయాలని అన్నారు. స్వీయ గణన చేసిన ప్రతి ఒక్కరు తమకు వచ్చిన ఐడీ నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, తద్వారా ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండవచ్చని తెలిపారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైందని పేర్కొంటూ, జిల్లా ప్రజలు బాధ్యతతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ కోరారు. జనాభా లెక్కల స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ప్రభుత్వానికి సరైన సమాచారాన్ని అందించడంలో సహకరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :