తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్14(తెలుగు వెలుగు) జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ నెల 15,16,17 తేదీ లలో జరిగే వినాయకుడి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలలో dj సౌండ్ వాడకూడదని. ఎవరైనా డీజే పెట్టినట్లు సమాచారం అందినట్లయితే వెంటనే డీజేని సీజ్ చేసి హైకోర్టు ఆదేశనురంగా కేసు నమోదు చేయడం జరుగుతుందని. ఊరేగింపు కార్యక్రమాలు రాత్రిళ్ళు 10 గంటల లోపు బంద్ చేయాలని. ఎవరైనా మద్యం సేవించి అల్లరులు, గొడవలు జరిగేలా ప్రేరేపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. గణేష్ నిమజ్జనం మంచి వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ